Site icon NTV Telugu

భార‌త్ కోవిడ్ అప్‌డేట్‌.. తాజా కేసులు ఎన్నంటే..?

భార‌త్‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దేశ‌వ్యాప్తంగా తాజాగా 2.34 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ్యాప్తంగా 2,34,281 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో 893 మంది క‌రోనా బాధితులు క‌న్నుమూశారు.. ఇదే స‌మ‌యంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌స్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్. ఇక‌, డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది.. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసిన‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.

Read Also: అక్క‌డి రేప‌టి నుంచే స్కూళ్లు.. సిద్ధం చేసేప‌నిలో సిబ్బంది..

Exit mobile version