NTV Telugu Site icon

COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?

Covid 19

Covid 19

భారత్‌లో కరోనా రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం) దేశవ్యాప్తంగా 16,167 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరోవైపు, 41 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా బులెటిన్‌లో పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో 15,549 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకోగా.. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 4,41,61,899కు చేరుకోగా.. మరణాలు 5,26,730గా ఉన్నాయి.. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,34,99,659కి పెరిగింది.. మరోవైపు.. ఆదివారం ఒకేరోజు దేశ్యాప్తంగా 34,75,330 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 206.56 కోట్లు దాటేసింది.

Read Also: Komatireddy Rajagopal Reddy: రాజీనామాను నిమిషాల్లోనే ఆమోదం

Show comments