Site icon NTV Telugu

ఇండియాలో మ‌ళ్లీ పెరిగిన కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  అక్టోబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ పీక్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.  త‌ప్ప‌ని స‌రిగా మాస్క్‌లు పెట్టుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  ఇదిలా ఉంటే గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 37,593 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,25,12,366 కి చేర‌గా ఇందులో 3,17,54,281 మంది ఇప్ప‌టికే కోలుకున్నారు.  3,22,327 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 648 మంది మృతి చెందారు.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,35,758 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో 24 గంట‌ల్లో 61,90,930 మందికి టీకాలు వేశారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 59,55,04,593 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Read: తమిళనాడులో క‌ల‌క‌లం రేపిన బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్‌…

Exit mobile version