దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి బులిటెన్ ప్రకారం రోజువారీ కేసులు 40వేలకు పైగా నమోదవ్వగా, ఈరోజు రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం కేసులు 40 వేలకు దిగువున నమోదయ్యాయి. ఇండియాలో కొత్తగా 38,949 కేసులు నమోదవ్వగా, 542 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది. ఇందులో 3,01,83,876 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,30,422 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
Read: “ఆదిపురుష్” స్టార్ క్యాస్ట్ జాబితాలో మరో ప్రముఖ నటుడు
ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 40,026 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,12,531 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 39,78,078 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇప్పటి వరకు 39,53,43,767మందికి టీకాలు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
