Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేట్…

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స‌డ‌లింపులు ఇస్తున్నారు.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,96,33,105కి చేరింది.  ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2542 మంది మృతి చెందారు.  ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,79,573కి చేరింది.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 1,07,628 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు 26,19,72,014 మందికి వ్యాక్సిన్ అందించారు.  24 గంట‌ల్లో 28 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Exit mobile version