Site icon NTV Telugu

CDSCO: ప్రభుత్వ ల్యాబ్స్‌లో తనిఖీలు నిర్వహించాకే.. దగ్గు మందు ఎగుమతికి అనుమతి

Drug Test

Drug Test

India Considers Testing Cough Syrups Before Export: భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే నాసిరకం దగ్గు సిరప్‌ల ఎగుమతులను నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎగుమతులకు ముందు ప్రభుత్వ ప్రయోగశాలలలో తనిఖీలను చేయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పంపిన ప్రతిపాదనను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్

ఎగుమతి చేసే ముందు వస్తువులను ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షించాలనే ప్రతిపాదన ఉంటుందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మే మొదటి వారంలో మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపించారు. ఈ నమూనాలను ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ మరియు చండీగఢ్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు గౌహతిలో ఉన్న ఆరు CDSCO నెట్‌వర్క్ ల్యాబ్‌లలో పరీక్షించనున్నారు. ఈ ల్యాబ్‌లే కాకుండా, ఈ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క NABL- గుర్తింపు పొందిన డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లలో కూడా పరీక్షించవ చ్చని అధికారు చెబుతున్నారు. CDSCO ప్రయోగశాలల్లో ప్రాంతీయ ఔషధ పరీక్షా ప్రయోగశాలలు (చండీగఢ్ మరియు గౌహతి), సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (కోల్‌కతా), మరియు సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీలు (చెన్నై, హైదరాబాద్ మరియు ముంబై) ఉన్నాయి.

Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి

ఎగుమతి కోసం సరుకును విడుదల చేయడానికి ఎగుమతిదారు ఆమోదించబడిన ల్యాబ్‌లలో ఒకదాని నుండి ఎగుమతి చేయబడే బ్యాచ్‌ల యొక్క సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ తోపాటు ఇతర డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుందని ప్రతిపాదన తెలపుతోంది. ఉజ్బెకిస్థాన్, గాంబియా మరియు మార్షల్ దీవులు మరియు మైక్రోనేషియాతో సహా భారతీయ ఔషధాల దిగుమతిదారులచే అనేక ఆరోపణలపై నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మేడ్-ఇన్-ఇండియా దగ్గు సిరప్‌లు విషపూరిత రసాయనాలతో కలుషితమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశంలో తయారైన దగ్గు మందులను ఎగుమతి చేయడానికి ముందు ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షించిన అనంతరం ఎగుమతి చేయనున్నారు

Exit mobile version