India-France: ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్.. రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఆమోదం
- ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్
- రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్‌తో భారత్ బిగ్ డీల్ కుదుర్చుకుంది. రూ. 63,000 కోట్లతో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. తాజా ఒప్పందంతో భారత నావికాదళానికి 22 సింగిల్-సీటర్, నాలుగు ట్విన్-సీటర్ విమానాలు రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్రాన్స్‌తో భారత్ ఒక మెగా ఒప్పందం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల చివరిలో ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను భారతదేశాన్ని సందర్శించినున్నారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: IPL 2025: ఊసరవెల్లి అంటూ.. లైవ్ టీవీలో సిద్ధూ, రాయుడు గొడవ!
Also Read
2023, జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ.. ఫ్రాన్స్ నుంచి రాఫెల్-ఎం జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌తో కలిసి ఈ రాఫెల్ ఎం జెట్‌లు పని చేయనున్నాయి. ఒప్పందం తర్వాత 37 నుంచి 65 నెలల్లో రాఫెల్ విమానాలు డెలివరీ అవుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తం అయింది. రాఫెల్ ఎం జెట్ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడనున్నాయి. పొరుగువారి నుంచి ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తండ్రి మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?