Site icon NTV Telugu

India-China Flights: ఐదేళ్ల తర్వాత చైనాకు విమాన సర్వీసులు.. ఎయిర్ ఇండియా, ఇండిగోలకు కేంద్రం ఆదేశాలు

China

China

India-China Flights: గత కొన్నేళ్లుగా భారత్–చైనా మధ్య సంబంధాలు ఉద్రిక్తతంగా కొనసాగుతున్నాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో ఇండియన్ ఆర్మీకి చెందిన పలువురు మరణించారు. దీంతో సైనిక ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాలు నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించాయి. పలుమార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగినప్పటికీ, కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ఉద్రిక్తతల ఫలితంగా ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక, డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అలాగే మహమ్మారి సమయంలో భారత్ కి వచ్చే విమాన సర్వీసులు నిలిపివేసింది. కాగా, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్చలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read Also: AP Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..

అయితే, వచ్చే నెలలో భారత్- చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరం అయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతాయని పేర్కొంది. ఇక, బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి విమానయాన సంస్థలకు తక్షణమే చైనాకు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండమని భారత ప్రభుత్వం సూచించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా- చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version