Site icon NTV Telugu

ఇండియాలో మళ్లీ తగ్గిన కరోనా కేసులు… 24 గంటల్లో ఎన్నంటే ?

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు న‌మోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 48,698 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది.

read more : కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

ఇందులో 2,91,93,085 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,95,565 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1183 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,94,493 కి చేరింది. ఇక‌పోతే ఒక్క రోజులో 64,818 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Exit mobile version