NTV Telugu Site icon

దేశంలో తగ్గని కరోనా తీవ్రత…కొత్తగా 41,831 కేసులు

India Covid 19

India Covid 19

మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,831 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 541 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,258 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది…

red also : ఢిల్లీకి చేరిన విశాఖ ఉక్కు పోరాటం : రేపు, ఎల్లుండి నిరసనలు

దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,55,794 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,08,20,521 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,24,351 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,10,952 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 47,02,98,596 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.