NTV Telugu Site icon

INDIA Bloc: కేజ్రీవాల్‌ కోసం రంగంలోకి ఇండియా కూటమి.. ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్!

Kejriwal

Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కోసం కూటమి నేతలు ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్‭ను తీసుకొచ్చిన షియోమీ..

జూలై 30న జంతర్ మంతర్ దగ్గర ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని.. జూన్ 3 నుంచి జూలై 7 వరకు పలుమార్లు షుగర్ లెవల్స్ పడిపోయాయని మెడికల్ రిపోర్టులను బయటపెట్టింది. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం ఈనెల 30న కూటమి భారీ నిరసన చేపడుతున్నట్లు ఆప్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు కోర్టులు బెయిల్ పిటిషన్లు తిరస్కరించాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం 21 రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఆయన జూన్ 2న జైల్లో సరెండర్ అయిపోయారు. అనంతరం ట్రయల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కానీ అంతలోనే ఈడీ రూపంలో చుక్కెదురైంది. హైకోర్టు బెయిల్‌పై స్టే విధించడంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా ఆయనకు మరోసారి రిమాండ్ పొడిగించింది.

ఇది కూడా చదవండి: Kunamneni Sambasiva Rao : ఇంతటి కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతం