Rajya Sabha: ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం! ఇండియా కూటమి మద్దతు!
- రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
- ఇండియా కూటమి మద్దతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సభలో ప్రతిపక్షంపై చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తీర్మానానికి ఇండియా కూటమి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) కింద పార్టీలు మోషన్‌ను ముందుకు తెస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా కూటమికి చెందిన అన్ని పార్టీలు మోషన్‌పై సంతకం చేశాయి
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఉభయ సభలు ప్రారంభం అయిన దగ్గర నుంచి అదానీ లంచం వ్యవహారం సభలను కుదిపేస్తున్నాయి. దీంతో రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశం సభల్లో రగడ సృష్టిస్తోంది. అయితే సభలో ఛైర్మన్ ధన్కర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్షం పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇండియా కూటమి ఎంపీలంతా ఈ విషయంలో ఒక్కటవుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ఇదిలా ఉంటే ఉభయ సభల్లో గందరగోళం నేపథ్యంలో సభా నాయకుడు జేపీ నడ్డాను, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను తన ఛాంబర్‌కు రావాలంటూ ఛైర్మన్ ఆహ్వానించారు. సభలో చోటుచేసుకున్న పరిణామాలపై ధన్కర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సభ సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఛైర్మన్ చర్చించనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..