INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాహుల్ గాంధీ బృందం..
- రాష్ట్రపతితో 10 మంది ఇండియా కూటమి నేతల భేటీ..
- జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని వినతి పత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం కలిశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేస్తూ .. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం రాత్రి 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిశారు.
రాష్ట్రపతిని కలిసిన బృందంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీపీఐ నేత డి. రాజా, సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, వీసీకే నేత తొల్ తిరుమావళవన్ ఉన్నారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఇదిలా ఉంటే, ఇండియా కూటమి ఎంపీలు సేవ్ డెమోక్రసీ బ్యానర్ పట్టుకుని పార్లమెంట్ నుంచి బయలుదేరారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని విజయ్ చౌక్ వద్ద అడ్డుకున్నారు. దీంతో వీరు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. తమ లక్ష్యం నెరవేరే దాకా ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం, ఓటర్ల జాబితాలో తొలగించిన 13.3 కోట్ల మంది పేర్లను చేర్చడం, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు