NTV Telugu Site icon

Warship vs warship: హిందూ మహాసముద్రంలో ఉద్రిక్తత.. ఎదురుపడిన భారత్- చైనా నౌకాదళాలు..

Ind Vs China

Ind Vs China

Warship vs warship: హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు చైనా ట్రై చేస్తుంది. డ్రాగన్ కంట్రీ యొక్క దుర్మార్గపు ప్రణాళికలను విఫలం చేయడానికి భారతదేశం కూడా విభిన్న వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే, భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ముంబై మూడు రోజుల ప్రయాణం తర్వాత సోమవారం శ్రీలంకలోని కొలంబో పోర్టుకు చేరుకోగా.. ఈ ఐఎన్‌ఎస్ ముంబై డిస్ట్రాయర్ షిప్ లో 163 మీటర్ల పొడవు, 410 మంది సిబ్బంది ఉండొచ్చని తెలిపింది. భారత నావికాదళానికి చెందిన ఈ యుద్ధనౌక తొలిసారిగా శ్రీలంకకు చేరుకుందని భారత హైకమిషన్ కూడా తెలియజేసింది.

Read Also: Ganja Seized: పుష్ప సినిమాకు మించి స్మగ్లింగ్ కు ప్లాన్.. ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్..

అయితే, అదే సమయంలో మూడు చైనా యుద్ధ నౌకలు సైతం శ్రీలంకకు చేరుకున్నాయి. INS ముంబై చైనా యుద్ధనౌకలు.. శ్రీలంక యుద్ధనౌకలతో విడివిడిగా “పాసేజ్ ఎక్సర్‌సైజ్‌లు” నిర్వహించనుందని డిస్ట్రాయర్ INS ముంబై కెప్టెన్ సందీప్ కుమార్ వెల్లడించారు. అదే సమయంలో క్రీడలు, యోగా, బీచ్ క్లీనింగ్ వంటి ఉమ్మడి కార్యక్రమాల్లో మూడు దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి. ఆగస్టు 29వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది.