Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తొలి గంటలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు అంకెలు సూచించడం లేదు. ముఖ్యం దేశంలో అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి చాలా పోటీని ఇస్తుంది. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకు చెరో సగం స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Read Also: Jammu Kashmir: ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి లోక్‌సభ ఎన్నికలు.. ముందంజలో ఇండియా కూటమి
ప్రస్తతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం, 33 స్థానాల్లో ఎన్డీయే కూటమి, 35 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లకు గానూ 62 సీట్లలో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందింది. అయితే, ఈ సారి మాత్రం పరిస్థితి కొత్త బీజేపీకి ప్రతికూలంగా కనిపిస్తోంది.
