NTV Telugu Site icon

Income Tax Slabs 2024: కొత్త పన్ను విధానంలో చేసిన మార్పుల శ్లాబులు ఇవే..!

It

It

Income Tax Slabs 2024: 2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొద్దీగా రిలీఫ్ దొరికింది. కేంద్ర సర్కార్ ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేసింది. కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గించేసింది. ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాలలో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. ఇక, కొత్త పన్ను విధానంలో మాత్రమే స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొనింది.

Read Also: Rana Naidu 2: ‘రానా నాయుడు 2’ అప్‌డేట్‌ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌!

ఈ కొత్త విధానంలోని పన్ను మారిన శ్లాబులు..
1. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు..
2. కొత్త పన్ను విధానంలో గతంలో మాదిరి.. రూ. 3 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు..
3. రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను..
4. రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం ట్యాక్స్..
5. రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయానికి 15 శాతం పన్ను..
6. రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయానికి 20 శాతం ట్యాక్స్ ఉంటుంది.
7. రూ. 15 లక్షలపైన ఆదాయానికి 30 శాతం పన్ను వర్తింపజేశారు.

అయితే, ఈ విధానం వల్ల వేతన జీవులకు దాదాపు 17,500 రూపాయల పన్ను ఆదా అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న డాటా ప్రకారం మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా వెల్లడించారు.