NTV Telugu Site icon

IT Raids: ఒడిశా వ్యాప్తంగా ఐటీ దాడులు.. రూ.200 కోట్లు స్వాధీనం..

It Raids

It Raids

IT Raids: ఒడిశాలోని మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒడిశా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడ్డాయి. బుధవారం మద్యం పరిశ్రమలో పన్నుల ఎగవేతపై ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేయడం ప్రారంభించారు. గురువారం కూడా ఈ కేసులో అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ ఒడిశాలోని ప్రముఖ మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన బల్డియో సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రైడ్స్ నిర్వహించారు.

Read Also: Tejas Jet: తేజస్ క్రేజ్ మామూలుగా లేదు.. కొనేందుకు ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఆసక్తి

దీంతో పాటు గురువారం మరో మద్యం తయారీదారు బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన సంబల్ పూర్ కార్యాలయంలో రూ.150 కోట్లకు పూగా నిధులను జప్తు చేశారు. రెండు రోజుల్లో ఈ మద్యం కంపెనీల నుంచి ఏకంగా రూ. 200 కోట్ల నగదును పట్టుకున్నారు. మొత్తం 30 మంది సభ్యుల ఐటీ బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, ఎండీలను లక్ష్యంగా చేసుకుని కోల్‌కతా, రాంచీలో సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు బయలుదేరారు. 2019-2021 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు నికర లాభాలను తగ్గించి చూపించాయని అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్‌లో అనుమానాస్పద ఇతర చెల్లింపులు ఉన్నాయి. ఒడిశాతో పాటు జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరో అర డజన్ కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.