Karnataka: అతి వేగం ప్రమాదకరం. వాహనాన్ని అతి వేగంగా నడపడం వల్ల వాహనం నడుపుతున్న వారికే కాదు ఇతర వాహన ధారులకి అలానే కాలినడకన వెళ్లే వాళ్ళకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరులో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురి పైకి ఒక కారు దూసుకెళ్లింది. లేడీహిల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.
Read also:Ragging: గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సస్పెండ్
కాగా కారు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో 5 మంది ఎగిరి దూరంగా పడ్డారు. ఈ ప్రమాదంలో ఓ మహిళా మరణించింది. కాగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా గుర్తించారు. ఈ ఘటన తరువాత కారు డ్రైవ్ చేసిన కమలేష్ బల్దేవ్ ఒక కార్ షోరూమ్ ముందు తన కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఆ డ్రైవర్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ ఘటన మొత్తం అక్కడున్న స్థానిక సీసీ టీవీలో రికార్డైనది. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.