Anmol: హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్న జీవన శైలి చూస్తే, విలాసం అనే పదానికి చక్కగా సరిపోతుంది. ఈ దున్న ఖరీదు ఏకంగా రూ.23 కోట్లు. ఇది భారతదేశంలో జరిగే వివిధ అగ్రికల్చర్ ఫెయిర్స్‌లో అలరిస్తోంది. అన్మోల్ అనే దున్న ఏకంగా 1500 కిలోల బరువు ఉంది. దీని పరిమాణం, వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.
దాని యజమాని గిల్ మాట్లాడుతూ.. అన్మోల్ ఆరోగ్యం కాపాడటానికి, బలంగా ఉంచడానికి డ్రైఫ్రూట్స్ పెడగామని, అధికార క్యాలెరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను కలిపి దున్నకు అందిస్తామని చెప్పారు. దీని ఆహారం కోసమే రోజూ రూ. 1500 ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రతీరోజూ 250 గ్రాముల బాదం, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 ఎగ్స్, ఆయిల్ కేక్, పచ్చి మేత, నెయ్యి, సోయా బీన్స్, మొక్కజొన్న ఆహారంగా ఇస్తున్నారు. ప్రత్యేకంగా అందించే ఆహారం వల్లే అన్మోల్ ఎల్లప్పుడు పదర్శనలకు, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటుందని దాని యజమాని చెబుతున్నాడు.
Read Also: IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
దున్నకు రోజుకు రెండు సార్లు స్నానం, బాదం-ఆవాల నూనె ప్రత్యేక మిశ్రమంతో మసాజ్ చేస్తున్నారు. దీని వల్ల దున్న మరింత నిగనిగలాడేలా చేస్తుంది. అన్మోల్ తల్లి గేదె రోజుకు 25 లీటర్ల పాలను ఉత్పత్తి చేసేది. అయితే దీని ఖర్చును భరించేందుకు గేదెను అమ్మేసినట్లు యజమాని గిల్ చెప్పారు.
వారానికి రెండుసార్లు అన్మోల్ నుంచి వీర్యం సేకరిస్తున్నారు. దీనికి పశువుల పెంపకందారుల్లో మంచి డిమాండ్ ఉంది. దీని వీర్యం విక్రయించడం వల్ల నెలకు రూ. 4-5 లక్షల ఆదాయం వస్తోంది. అన్మోల్‌ని రూ. 23 కోట్లకు విక్రయించేందుకు ఆఫర్స్ ఉన్నాయని గిల్ చెప్పాడు. అయితే, తన దున్న అన్మోల్‌ని తన కుటుంబంలో సభ్యుడిగా చూస్తున్నానని, దానిని అమ్మేసే ఉద్దేశం లేదని చెప్పాడు.