Uranium In Water: ఛత్తీస్‌గఢ్‌లోని 6 జిల్లాల్లోని నీటిలో ప్రమాదకరమైన స్థాయిలో ‘‘యురేనియం’’ ఉందని తేలింది. అణు కార్యక్రమాల్లో ఉపయోగించి యూరేనియం మోతాదుకి మించి నీటిలో ఉండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక లీటర్‌నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమిత, ప్రభుత్వం ప్రకారం లీటర్ నీటిలో 30 మైక్రోగ్రాములతో పోలిస్తే ఈ నీటిలో యురేనియా మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంది. నీటిలో ఈ స్థాయిలో యురేనియం ఉండటం ప్రజల్లో క్యాన్సర్లు, ఊపిరితిత్తుల రోగాలు, చర్మ, మూత్రపిండాల వ్యాధులకు కారణం అవుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, కంకేర్, బెమెతర, బలోడ్, కవార్ధా ప్రాంతాలలోని తాగు నీటి నమూనాల పరీక్షలలో లీటరుకు 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ యురేనియం స్థాయిలు కనుగొనబడ్డాయి. 2017లో డబ్ల్యూహెచ్‌ఓ లీటర్ నీటిలో 15 మైక్రోగ్రాముల పరిమితికి మించకూడదని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ భారత్ లాంటి కొన్ని దేశాల్లో ఈ పరిమితిని రెట్టింపు చేసింది. జూన్‌లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం లీటరుకు 60 మైక్రోగ్రాములు కూడా సురక్షితమని సూచించింది.
Read Also: Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని ఆరు జిల్లాల్లో ఇది 100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉంది. బలోడ్‌లోని ఒక గ్రామంలోని నీటిని పరీక్షిస్తే ఇది 130 మైక్రోగ్రాములు ఉంది. కాంకేర్ జిల్లాలో లీటర్‌కి 106 మైక్రోగ్రాముల యురేనియం ఉంది. ఆరు జిల్లాల్లో సగటున లీటర్ నీటికి 86 నుంచి 105 మైక్రోగ్రాముల యురేనియం ఉంది.
భారతదేశంలో పలు రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అనేది ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జనవరిలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇచ్చిన నివేదిక పంజాబ్ మరియు హర్యానాతో సహా 12 రాష్ట్రాల్లో అనుమతించదగిన పరిమితులను దాటిందని పేర్కొంది. ఇందులో రెండు రాష్ట్రాలు భారతదేశంలో సగానికి పైగా గోధుమను పండించేవి ఉన్నాయి. ఆగస్టు 2022లో, బీహార్‌లోని తొమ్మిది జిల్లాలు నీటిలో యురేనియం అధిక స్థాయిలో ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. 100 శాతం గ్రేడ్ యురేనియం నాలుగు నిక్షేపాలకు చత్తీస్‌గఢ్ కేంద్రంగా ఉంది. వీటిలో మూడు రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ తాగునీటిలో యురేనియం ఉన్నట్లు తేలింది.