Site icon NTV Telugu

Gold Sweets: జైపూర్‌లో ఆకట్టుకుంటున్న బంగారం స్వీట్స్.. ధరెంతో తెలుసా!

Gold Sweets

Gold Sweets

దీపావళి అంటేనే గుర్తొచ్చేది విద్యుత్ దీపాలు.. కొత్త బట్టలు.. రకరకాలైన స్వీట్లు. సందడి.. సందడి వాతావరణం. ఇంటిల్లిపాది టపాసులు కాల్చడం.. ఇలా దీపావళికి ఎన్నెన్నో కొత్త సంగతులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. రకరకాలైన పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అందులో స్వీట్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. స్వీట్స్ బాక్సులను గిఫ్ట్‌లుగా కూడా ఇస్తుంటారు. దీంతో దీపావళి సమయంలో స్వీట్స్‌ షాపులకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే అన్ని స్వీట్స్ షాపుల్లో అమ్మినట్టుగా అమ్మితే స్పెషల్ ఏమంటుందని అనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ జైపూర్‌లో ఒక స్వీట్‌మేకర్ మాత్రం బంగారం స్వీట్లు విక్రయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు దాని స్పెషల్ ఏంటి? దాని ఖరీదు ఎంతో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఇది కూడా చదవండి: Delhis Railway Station: రణరంగంగా ఢిల్లీ రైల్వేస్టేషన్.. డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్

జైపూర్‌లోని ఒక స్వీట్‌మేకర్ బంగారంతో కలిపిన స్వీట్స్‌ను  విక్రయిస్తున్నాడు. ‘‘స్వర్ణ భస్మ’’ లేదా స్వర్ణ ప్రసాదం పేరుతో పిలువబడే ఈ స్వీట్స్‌ను తినదగిన రీతిలో తయారు చేస్తుంటారు. 24 క్యారెట్ల తినదగిన బంగారం, కుంకుమ పువ్వు, బాదం, ఆయుర్వేద పదార్థాలతో ఈ స్వీట్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ స్వీట్స్‌లో ఆరోగ్యాన్ని మిళితం చేసే పదార్థాలే ఉంటాయి. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్స్‌గా పేరుగాంచింది. ప్రస్తుతం కిలో స్వీట్స్ రూ.1.11 లక్షల ధర పలుకుతుంది.

ఇది కూడా చదవండి: Rivaba Jadeja: ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్వీట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లకు నోరూరుతోంది. అద్భుతమైన ప్రసాదం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ స్వీట్లు దక్కించుకోవాలంటే మాత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాల్సిందే. ఇక ఇందుకు సంబంధించిన గోల్డ్ స్వీట్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.

 

Exit mobile version