Site icon NTV Telugu

Rahul Gandhi: దేశంలో కులగణన చాలా ముఖ్యం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీహార్ లో 84 శాతం మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది. వారి జనాభా ప్రకారం వారి వాటా ఉంటుందని కులగణన రుజువు చేసిందని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో కేవలం మగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారని, భారత బడ్జెట్ లో కేవలం 5 శాతం మాత్రమే కేటాయించబడుతోందని, కాబట్టి దేశంలో కుల గణన చాలా ముఖ్యమని హిందీలో ట్వీట్ చేశారు.

Read Also: Pakistan: సౌదీకి వెళ్తున్న పాక్ బిచ్చగాళ్ల అరెస్ట్.. విమానం నుంచి దించి విచారణ..

కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం జనాభా గణన చేపట్టిందని అయితే దాని ఫలితాలను మోడీ ప్రభుత్వం వెల్లడించలేదని కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. మోడీ ప్రభుత్వం కులగణన చేపట్టకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ వర్గానికి హక్కు కల్పించేలా కుల గణణ చేపడతామని కాంగ్రెస్ వెల్లడించింది.

ఈ రోజు బీహార్ ప్రభుత్వం కులగణన ఫలితాలను వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీ, ఈబీసీలు అత్యధికంగా 63 శాతం ఉన్నారని వెల్లడించింది. మొత్తం రాష్ట్ర జనాభా 13.07 కోట్లుగా ఉంది. అత్యంత వెనబడిన వర్గం 36 శాతంగా ఉంది, ఇతర వెనకబడిన తరగతులు 27.13 శాతం ఉన్నారు. బీహార్ లో యాదవ జనాభా ఏకంగా 14.7 శాతం ఉన్నట్లు తెలిపింది. 19.65 శాతం ఎస్సీలు ఉండగా, ఎస్టీలు 1.68 శాతం ఉన్నారు. అగ్ర కులాల వారు 15.52 శాతం ఉన్నారు.

Exit mobile version