NTV Telugu Site icon

UGC: యూజీసీ కీలక నిర్ణయం.. డిగ్రీలు, ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికెట్లపై ఆధార్ నంబ‌ర్ ముద్రించొద్దు

Ugc

Ugc

UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ లో విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ను ప్రింట్ చేయవద్దని నిర్ణయించింది. ఈ నిర్నయాన్ని అమలు చేయాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇకపై విద్యార్థుల వ్యక్తిగత డాటా చోరీ జరిగే అవకాశం ఉండదని యూజీసీ ప్రకటించింది. యూజీసీ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు, ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌పై ఆధార్ నంబ‌ర్ ముద్రించొద్దని యూనివ‌ర్సిటీల‌ను యూజీసీ ఆదేశించింది. ఇక‌పై స‌ర్టిఫికెట్ల‌పై ఆధార్ నంబ‌ర్ ప్రింట్ చేయ‌డంపై నిషేధం విధించింది. నిబంధ‌న‌ల ప్రకారం.. ఆధార్ నంబ‌ర్‌ను ప‌బ్లిక్‌గా బ‌హిర్గతం చేయ‌కూడ‌ద‌ని యూజీఏసీ సెక్రట‌రీ మ‌నీష్ జోషి యూనివ‌ర్సిటీల‌కు రాసిన లేఖ‌లో స్పష్టం చేశారు. డిగ్రీలు, ప్రొవిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల మీద ఆధార్ నంబ‌ర్లు ప్రింట్ చేస్తే, అవి అనుమ‌తించ‌బ‌డ‌వు అని స్పష్టం చేశారు. యూఏడీఏఐ నిబంధ‌న‌ల‌ను ఉన్నత విద్యాసంస్థలు ఖచ్చితంగా ఫాలో కావాల‌ని సూచించారు.
అయితే ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విష‌యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ నంబ‌ర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల ప‌రిధిలోని యూనివ‌ర్సిటీలు అభ్యర్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబ‌ర్లు ముద్రిస్తున్నారు. ఇది స‌రికాద‌ని యూజీసీ తేల్చిచెప్పింది.

Read Also: Snake Security: దొంగలు కూడా మనషులే సార్.. ఇలాంటి సెక్యూరిటీ ఎవరైనా పెడతారా?

విద్యార్థుల ప్రైవేట్ డేటాను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ నొక్కి చెప్పింది. బదులుగా, అన్ని యూనివర్సిటీలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ కొలత విద్యార్థుల వ్యక్తిగత డేటాబేస్‌ను రక్షించడం మరియు వారి గోప్యతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్‌ నిబంధనలను అనుసరించడం ద్వారా, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల గోప్యతను గౌరవించేలా చూసుకోవచ్చు. విద్యార్థులు ఇప్పుడు తమ ఆధార్ కార్డ్ నంబర్‌లు తమ డిగ్రీలు మరియు సర్టిఫికేట్‌లపై ప్రదర్శించబడవని నిర్ణయించుకోవచ్చు, వారి వ్యక్తిగత డేటాను భద్రపరచడాన్ని యూజీసీ చూసుకుంటుంది.. మీ చదువులపై దృష్టి పెట్టండి మరియు మీ గోప్యతా సమస్యలను యూజీసీ కాపాడుతుందని పేర్కొన్నారు.