భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ముంబైకి రెడ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జయంత సర్కార్ తెలిపారు.. ఈ రోజు రుతుపవనాలు ముంబైకి వచ్చాయి, సాధారణంగా ప్రతీ సంవత్సరం జూన్ 10 వస్తాయని.. కానీ, ఈ ఏడాది ముందుగానే వచ్చాయని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కుర్లా మరియు సియోన్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై నీరు ప్రవహిస్తున్నందున.. కుర్లా – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య స్థానిక రైలు సర్వీసులు నిలిపివేసినట్టు సెంట్రల్ రైల్వే ప్రకటించింది.. భారీ వర్షం, వరదలతో ఉదయం 9.50 గంటలకు ట్రాఫిక్ ఆగిపోయింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు.. మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో రెడ్, ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.. వచ్చే 4 రోజులు ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఐఎండీ అధికారులు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Tags
- IMD
- Monsoon
- Mumbai rains
- Red Alert
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!