Site icon NTV Telugu

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ముంబైకి రెడ్ అలర్ట్..

Mumbai Rains

Mumbai Rains

మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జయంత సర్కార్ తెలిపారు.. ఈ రోజు రుతుపవనాలు ముంబైకి వచ్చాయి, సాధారణంగా ప్రతీ సంవత్సరం జూన్ 10 వస్తాయని.. కానీ, ఈ ఏడాది ముందుగానే వచ్చాయని తెలిపారు.

భారీ వర్షాల కారణంగా కుర్లా మరియు సియోన్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై నీరు ప్రవహిస్తున్నందున.. కుర్లా – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య స్థానిక రైలు సర్వీసులు నిలిపివేసినట్టు సెంట్రల్ రైల్వే ప్రకటించింది.. భారీ వర్షం, వరదలతో ఉదయం 9.50 గంటలకు ట్రాఫిక్ ఆగిపోయింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు.. మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో రెడ్‌, ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ముంబైలో రెడ్‌ అలర్ట్ ప్రకటించింది.. వచ్చే 4 రోజులు ముంబైకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఐఎండీ అధికారులు.

Exit mobile version