NTV Telugu Site icon

Heavy rain alert: 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల

Hevay

Hevay

దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, గుజరాత్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్‌ అలర్ట్‌ అమల్లో ఉంటుందని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: AP: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం

ఇక హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”