NTV Telugu Site icon

WhatsApp Loan: వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెట్టండి.. రూ.10 లక్షల లోన్ పొందండి

Whatsapp Iifl Finance

Whatsapp Iifl Finance

IIFL Finance is offering up to Rs 10 lakh business loan to customers on WhatsApp: ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరుగుతోంది కాబట్టి.. ఫైనాన్స్ రంగం కూడా డిజిటల్‌గా మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు IIFL ఫైనాన్స్ సంస్థ వాట్సాప్‌లో వినియోగదారులకు రూ. 10 లక్షల వరకు వ్యాపార రుణాన్ని అందిస్తోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. వాట్సాప్‌లో బిజినెస్ లోన్ అనేది MSME లెండింగ్ పరిశ్రమలో మొదటి-రకం చొరవ అని ఆ సంస్థ తెలిపింది. మన భారతదేశంలో ఉన్న 45 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు.. ఈ IIFL ఫైనాన్స్ నుండి 24×7 ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

PM Bengaluru Roadshows: పీఎం బెంగళూరు రోడ్‌షోలో మార్పులు.. కారణమిదే!

ఒక శక్తివంతమైన ఏఐ-బాట్ వాట్సాప్‌లో రుణ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారుల ఇన్‌పుట్‌లను లోన్ ఆఫర్‌కు సరిపోల్చి, అప్లికేషన్‌ను సులభతరం చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులు 9019702184 అనే నంబర్‌కు కేవలం “హాయ్” అనే మెసేజ్ పంపితే.. IIFL ఫైనాన్స్ నుంచి నేరుగా లోన్ పొందవచ్చు. కాగితరహిత ప్రక్రియను త్వరగా పూర్తి చేసి.. ఖాతాలో డబ్బులు పొందవచ్చు. IIFL ఫైనాన్స్‌లో బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ మాట్లాడుతూ.. “IIFL ఫైనాన్స్ సంక్లిష్టమైన లోన్ అప్లికేషన్‌ను సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా పేపర్‌లెస్ రుణ దరఖాస్తుని అందుబాటులోకి తీసుకొచ్చింది. చిరు వ్యాపారవేత్తలపైనే మేము ప్రధానంగా దృష్టి సారించాం. ఈ వాట్సాప్ ద్వారా తక్షణమే వ్యాపార రుణం అందిస్తాం’’ అంటూ చెప్పుకొచ్చారు.

Smriti Irani: కాంగ్రెస్ హిందూ ద్వేషి, బీజేపీ అధికారంలోకి వస్తుంది.. స్పృతి ఇరానీ జోస్యం

కాగా.. భారతదేశంలో ఉన్న అతి పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీలలో ‘ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్’ ఒకటి. ఇప్పటికే ఈ సంస్థ హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్ వంటి వాటిని అందిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా లోన్ అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి.. ఇలాంటి సేవలు అందించే మొదటి సంస్థగా IIFL రికార్డ్ సృష్టించింది.అయితే.. ఈ లోన్ పొండానికి KYC, బ్యాంకు అకౌంట్ వెరిఫికేషన్ వంటివి ఆన్లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది.

Show comments