NTV Telugu Site icon

Viral Video: విద్యార్థులు డ్రగ్ డీలర్లను చేరినప్పుడు, మీ వల్ల ఎందుకు కాదు.? పోలీస్‌ని ప్రశ్నించిన స్టూడెంట్..

Viral News

Viral News

Viral Video: డ్రగ్స్‌పై ఓ పోలీస్ ఉన్నతాధికారిని స్టూడెంట్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హర్యానాలోని సోనిపట్‌లో పోలీసులు నిర్వహించిన డ్రగ్ డి అడిక్షన్ ప్రచారంలో విద్యార్థి పోలీసుల్ని నిలదీశారు. డ్రగ్స్ అంత సులువుగా దొరికేలా చేస్తున్నారని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు. ‘‘ సార్, డ్రగ్స్ డి-అడిక్షన్ క్యాంపెయిన్‌ని ఇంత పెద్ద కార్యక్రమం చూశాను. కానీ మా యూనివర్సిటీ డ్రగ్స్ వ్యసనానికి అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఈ రోజు నాలుగు యూనివర్సిటీల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. లాలీపాప్‌లా గంజాయి లేదా ఏదైనా పదార్థం పొందడం సులువుగా మారింది.’’ అని విద్యార్థి చెప్పాడు.

Read Also: Congress: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎంతమందంటే!

ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ డ్రగ్స్ వ్యాపారులను గుర్తించగలిగితే, పోలీసులు ఎందుకు చేయలేరు.? పోలీసులు వెనుకబడి ఉన్నారా.? అని ప్రశ్నించారు. నేను ఈ యూనివర్సిటీ విద్యార్థిని, మాకు దగ్గరలో ఉన్న పోలీస్ పోస్టుకు ఎదురుగా గంజాయి దొరుకుతుందని నాకు తెలుసు. ఇది పోలీసులకు తెలియకపోవడం వైఫల్యం అని మీరు అనుకోవడం లేదా..? అని అడిగాడు.

సోనిపట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ లా యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగినట్లు కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. విద్యార్థి ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అతనిలా ఎక్కువ మంది భారతీయులు ధైర్యం చూపిస్తే మనం నిజంగానే విశ్వగురువు అవుతాము అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, మరొకరు నిజంగా విద్యార్థి చట్టవ్యతిరేక కార్యకలాపాల్ని చూస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందని రాశారు.