NTV Telugu Site icon

Bajrang Punia: నేను బీజేపీలో చేరి ఉంటే ఏ నిషేధం ఉండేది కాదు.. నాడాపై బజరంగ్ పునియా ఫైర్

Punia

Punia

Bajrang Punia: ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. ఈ నిషేధంపై ఈరోజు (నవంబర్ 28) పూనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనతో పాటు మరి కొందరు రెజ్లర్లను లక్ష్యంగా చేసి.. అధికారుల ద్వారా వేధిస్తోందని ఆరోపణలు చేశారు. తమ గొంతు నొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. కానీ తాను తలవంచబోనని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని చెప్పుకొచ్చారు. వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి సపోర్టుగా నిలిచిన నాటి నుంచే మోడీ సర్కార్ తమను టార్గెట్ చేసిందని బజరంగ్ పూనియా పేర్కొన్నారు.

Read Also: Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..

ఇక, డోప్ టెస్ట్ కోసం నమూనాలు ఇవ్వడానికి నిరాకరించారనే ఆరోపణలపై బజరంగ్ పూనియా క్లారిటీ ఇచ్చారు. 2023 డిసెంబర్ లో డోప్ టెస్ట్ నమూనాల కోసం ఓ టీమ్ తమ నివాసానికి వచ్చిందని తెలిపారు. అయితే, వాళ్లు తీసుకువచ్చిన టెస్టింగ్ కిట్స్ అప్పటికే ఎక్స్ పైరీ అయిపోయాయని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ రోజే తాను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. వచ్చిన వారి దగ్గర ఐడీ కార్డ్స్ లేవు.. ఆ సమయంలో తాను ఓ పోటీలో పాల్గొన్నాను అని ఆయన గుర్తు చేశారు. రూల్స్ ప్రకారం ఓ టోర్నమెంట్ జరుగుతుండగా ఏ ఆటగాడి దగ్గర నమూనాలు స్వీకరించడం కుదరదు.. అదే విషయాన్ని వారికి చెప్పి.. తన మ్యాచ్ పూర్తిన తర్వాత వేరే కిట్స్ తీసుకుని రమ్మన్నానని తెలియజేశా.. కానీ నాడా తనపై విధించిన బ్యాన్ పై చట్టపరంగా పోరాడతా.. ఎవరికీ తలవంచబోనని బజరంగ్ పూనియా వెల్లడించారు.