NTV Telugu Site icon

IC814 hijack: హైజాక్ విమానంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. గుర్తించని ఉగ్రవాదులు.. అతను ఎవరంటే..?

Ic 814

Ic 814

IC814 hijack: 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేసి తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహర్ తరలించారు. వారం రోజుల పాటు ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుని, భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుచున్నారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కూడా ఉన్నాడు. ఇతడే ఆ తర్వాత 2001 పార్లమెంట్ దాడి, ఉరీ, పుల్వామా, ముంబై ఉగ్రదాడులకు కారణమయ్యాడు.

ఇదిలా ఉంటే, ఈ ఇతివృత్తం నేపథ్యంగా ‘‘IC814 ది కాందహార్ హైజాక్’’ని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద హైజాకర్ల పేర్లను భోలా, శంకర్ అని హిందువులను కించపరిచేందుకు ప్రయత్నించారని సిరీస్ మేకర్స్, నెట్‌ఫ్లిక్స్‌పై ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది. చివరకు నెట్‌ఫ్లిక్ దిగొచ్చి మరోసారి ఇలాంటి తప్పులు జరగనీవ్వమని కేంద్రానికి హామీ ఇచ్చింది.

Read Also: Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన

ప్రస్తుతం జనరేషన్‌కి 1999 హైజాక్‌ని మరోసారి ఈ సిరీస్ పరిచయం చేసింది. ఖట్మాండు నుంచి 176 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక సంపన్న వ్యాపారవేత్త ఉండటం గురించి, హైజాకర్లు కనిపెట్టలేకపోయారు. ప్రయాణికులకు కూడా అతడి గురించిన వివరాలు తెలియవు. ఈ ప్రయాణికుడే రాబర్టో గియోరి, స్విస్-ఇటాలియన్ వ్యాపారవేత్త. ఆ సమయంలో స్విట్జర్లాండ్‌లోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో గియోరీ ఒకరు. ఇతను ప్రపంచంలోని కరెన్సీ – ప్రింటింగ్ వ్యాపారంలో 90 శాతానికి పైగా నియంత్రణ కలిగి ఉన్నాడు. యూకేకి చెందిన ‘డి లా రూ’ సంస్థ యజమాని. డి లా రూ ప్రపంచంలోనే 70 కంటే ఎక్కువ దేశాల కరెన్సీ ముద్రించే సంస్థ.

రాబోర్టో గియోరీ తన భాగస్వామి క్రిస్టినా కాలాబ్రేసితో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు ఖాట్మాండు వెళ్లారు. హైజాక్ చేయబడిన విమానంలో గియోరీ ఉండటం కూడా చర్చల సమయంలో భారత్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని సృష్టించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ హైజాక్ ఘటనలో ఒకే ఒక్క భారతీయ ప్రయాణికులు హత్యకు గురయ్యాడు. ప్రయాణికుల్ని విడిపించేందుకు భారత్ మసూద్ అజార్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.