NTV Telugu Site icon

New Delhi: కుక్క కోసం ఉద్యోగం పోగొట్టుకున్న ఐఏఎస్.. అతి చేస్తే ఇలానే అవుతుంది మరి

Dog Walking

Dog Walking

ఓ కుక్క కారణంగా ఐఏఎస్ అధికారిణి తన ఉద్యోగం పోగొట్టుకుంది. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు విపరీతంగా ఉన్న ప్రస్తుతం కాలంలో ఉన్నతాధికారిని అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పదవి ఊడపోతుందని నిరూపితమయ్యింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులను పంపించేసింది  ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా.  ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తీసుకువెళ్లారు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా దంపతులు. కుక్కను వాకింగ్ చేయించడం కోసం వారు  మైదానంలో ఉన్న క్రీడాకారులను ముందుగానే గ్రౌండ్ నుంచి పంపించి వేశారు.  సాధారణంగా ఈ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి.

Also Read: Khairatabad-Balapur Ganesh Live Updates: ఖైరతాబాద్‌-బాలాపూర్‌ నిమజ్జన అప్డేట్‌

అయితే తమ పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ దుగ్గా తన అధికారంతో గ్రౌండ్ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. ఐఏస్ అధికారిణి ఆదేశాల మేరకు  నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించేసేవారు. తరువాత రింకూ, ఆమె భర్త పెంపుడు కుక్క వాకింగ్ చేయడం కోసం గ్రౌండ్ అంతా ఉపయోగించారు. ఇలా తమ పర్సనల్ అవసరాల కోసం పబ్లిక్ ప్లేస్ ను ఉపయోగించడం దుమారం రేపింది. దీనిపై వివిధ మీడియా కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన కేంద్రప్రభుత్వం ఆమెను రాజీనామా చేయాలని కోరింది. దీంతో ఆమె రాజీనామా చేయక తప్పలేదు. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కేవలం రింకూ మాత్రమే కాదు ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ కూడా బాధ్యత గల పదవిలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం లద్దాఖ్ లో విధులు నిర్వహిస్తున్నారు.