NTV Telugu Site icon

Bihar: ఐఏఎఫ్ ఛాపర్‌లో సాంకేతిక లోపం.. వరద నీటిలో ల్యాండింగ్

Bihar

Bihar

బీహార్ వరదల్లో బాధితులకు సాయం చేస్తున్న ఐఏఎఫ్ ఛాపర్‌‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంగా వరద నీటిలో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. స్థానికులు పడవ సాయంతో దగ్గరకు వెళ్లి రక్షించారు. ఇద్దరు అధికారులతో సహా నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Satyavathi Rathod: కొండా సురేఖపై పరువునష్టం దావా వేసి.. కోర్టుకు ఈడుస్తాం..

గత కొద్ది రోజులుగా బీహార్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారు. దీంతో హెలికాప్టర్ సాయంతో బాధితులకు ఆహారం, నీళ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అయితే బుధవారం భారత వైమానికి దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా రిలీఫ్ మెటీరియల్‌ను అందిస్తుండగా ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం బలవంతంగా పైలట్ ల్యాండింగ్ చేశారు. దర్భంగా ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌.. ముజఫర్‌పూర్‌లోని నయా గావ్‌లో ల్యాండింగ్‌ చేసింది. ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్‌లోని కొంత భాగం వరద నీటిలో మునిగిపోయింది. పైలట్ తెలివిగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ తెలిపారు. ఇంజిన్ విఫలమైనప్పుడు చుట్టుపక్కల ప్రజలు లోతులేని నీటిలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా పైలట్‌కు సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. సిబ్బందిని ఆసుపత్రికి తరలించామని, ప్రమాదం జరిగిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహాయక చర్యలు ప్రారంభించిందని అమృత్ తెలిపారు. తొలుత ఆ ప్రాంత వాసులు సహాయక చర్యలు చేపట్టారని వివరించారు.

ఇది కూడా చదవండి: Jharkhand: జార్ఖండ్‌లో దుండగుల దుశ్చర్య.. రైల్వే ట్రాక్ పేల్చివేత

Show comments