వ్యాపారాలకు తాను వ్యతిరేకం అని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: UP: కుటుంబీకులకు ఆహారంలో మత్తు మందు కలిపి.. పెళ్లయిన యువకుడితో అమ్మాయి జంప్
బీజేపీలోని కొందరు వ్యక్తులు తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తానని చెప్పారు. తాను వ్యాపార వ్యతిరేకిని అస్సలే కాదని తెలిపారు. గుత్తాధిపత్యానికి, మార్కెట్ నియంత్రణ శక్తులకు మాత్రం వ్యతిరేకినని పేర్కొన్నారు. కేవలం వేళ్ల సంఖ్యలో వ్యక్తులు ఆధిపత్యం చెలాయించడానికి విరుద్ధం అని చెప్పారు. మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించానని.. వ్యాపార విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలనని రాహుల్ గాంధీ వీడియో పోస్టు చేశారు.
I am pro-Jobs, pro-Business, pro-Innovation, pro-Competition. I am anti-Monopoly.
Our economy will thrive when there is free and fair space for all businesses. pic.twitter.com/hySqQKpRdJ
— Rahul Gandhi (@RahulGandhi) November 7, 2024