Chirag Paswan: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో విభేదాలను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి తనకు విడదీయరాని బంధం ఉందని, తనను విడదీయలేరని అన్నారు. బీజేపీ కోరుకుంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నరేంద్రమోడీపై తన ప్రేమ చెక్కుచెదరలేదని , ఆయన ప్రధానిగా ఉన్నంత కాలం తనను ఆయనతో విడదీయలేరు అని చెప్పారు. వక్ఫ్ బోర్డు సంస్కరణలు, బ్యూరోక్రసీలో లాట్రల్ ఎంట్రీ వంటి వాటి గురించి అడిగిన సందర్భంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Airbus Beluga: ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్‌లో దిగింది..ప్రత్యేకతలు ఇవే..
వాస్తవానికి తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తాయి, వక్ఫ్ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. ఇటీవల కాలంలో బీజేపీకి సొంత బలం లేకుండా మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి రావడంతో చిరాగ్ పాశ్వాన్ తన అభిప్రాయాలను బీజేపీకి వ్యతిరేకంగా చెబుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి.
తన పార్టీ బీహార్, కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉందని, కాబట్టి మేము జాతీయ స్థాయిలో, సొంత రాష్ట్రంలో పొత్తు ధర్మానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ వారం ప్రారంభంలో దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక జనశక్తి పార్టీని విభజించిన పశుపతి కుమార్ పరాస్, అమిత్ షాతో భేటీ కావడంపై చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. బీజేపీని ధిక్కరించడానికి అనతు చాలా కష్టపడగలడని ఎద్దేవా చేశారు. అతను ప్రజా మద్దతుని కోల్పో్యాడని అన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ 5 ఎంపీ సీట్లను గెలుచుకుంది.