Site icon NTV Telugu

Himachal Pradesh: డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన వాహనాలు, యంత్రాలు

Himachalpradeshfloods

Himachalpradeshfloods

హిమాచల్‌ప్రదేశ్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరుసగా ఈ మధ్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. తాజాగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో వాహనాలు, భారీ యంత్రాలు కొట్టుకుపోయాయి. హైడ్రా క్రేన్, డంపర్ ట్రక్, రాక్ బ్రేకర్, కారు కొట్టుకుపోయాయి.

ఇది కూడా చదవండి: BJP New President: బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ.. ఎంపిక ఎప్పుడంటే..!

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నిరంతర వర్షాలు, ఆకస్మిక వరదలు కారణంగా పార్వతి నది నీటి మట్టం పెరిగి ఈ ప్రవాహం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని పండో ఆనకట్ట సమీపంలో చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైవేలో 50 మీటర్లకు పైగా కుంగిపోయింది. నిరంతర వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారు. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిలో పండోహ్ ఆనకట్ట, మండి-కులు మార్గంలోని బాగ్లముఖి రోప్‌వే మధ్య ఒక భాగం కూలిపోయింది.

ఇది కూడా చదవండి: CPI Narayana: ట్రంప్కు ప్రధాని మోడీ భయపడుతున్నాడు..

రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు కారణంగా.. రోడ్డు ప్రమాదాల కారణంగా 173 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నిర్ధారించింది. ఇందులో 95 మరణాలు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇళ్ళు కూలిపోవడం వల్ల సంభవించాయి. ఇంకో 78 మరణాలు రోడ్డు ప్రమాదాలు కారణంగా జరిగినట్లు తెలిపింది.

 

Exit mobile version