Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..
- హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..
- ఐఐటీ మద్రాస్ నేతృత్వంలో టెస్ట్ ట్రాక్ ఏర్పాటు..
- అసాధారణ వేగంతో ప్రయాణం దీని సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyperloop: ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌కి ఇండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు భారతదేశంలో మొట్టమొదటి ‘‘హైపర్‌లూమ్’’ టెస్ట్ ట్రాక్‌ని మరింత డెవలప్ చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌కు, ఇండియన్ రైల్వేస్ అదనంగా 1 మిలియన్ డాలర్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ‘‘ఆవిష్కార్’’ పేరుతో పిలువబడే 422 మీటర్ల పొడవైన ట్రాక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో గంటలకు 1000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో, ఈ వాక్యూమ్ ట్యూబ్‌లో హై స్పీడ్ రైలు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.
ఒక విధంగా చెప్పాలంటే, హైదరాబాద్-న్యూఢిల్లీల మధ్య దూరం దాదాపుగా 1700 కి.మీ. ఈ దూరాన్ని కేవలం 3 గంటల్లోనే హైపర్‌లూమ్ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు టెస్ట్ ట్రాక్ నిర్మాణం, అభివృద్ధిలో లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) కన్స్ట్రక్షన్, ఆర్సెలర్ మిట్టల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ పరిశ్రమ సంస్థల నుండి మద్దతు లభించింది. భవిష్యత్తులో చెన్నై-బెంగళూర్ మధ్య హైపర్‌లూమ్ కారిడార్‌ని రూపొందించడానికి ఈ సాంకేతికతు విస్తరించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు ఉన్నాయి.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్‌కి క్లియర్ మెసేజ్..
ఈ హైపర్‌లూమ్ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్న బుల్లెట్ రైల్ వంటి హైస్పీడ్ రైళ్లకు మించి ఉండబోతోంది. దేశంలో రవాణా మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అత్యంత వేగవంతమైన, సమర్థవంతమైన, స్థిరమైన ట్రావెల్ ఆప్షన్‌గా మారుతుంది. ఇది దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాకుండా. ప్రపంచ వేదికపై భారత్‌ని సరికొత్తగా ఆవిష్కరిస్తుంది.
హైపర్‌లూమ్ అంటే ఏమిటి.?
దీనిని ‘‘5వ రవాణా విధానం’’గా పిలుస్తారు. సుదూర ప్రాంతాల మధ్య అత్యద్భుత వేగంతో ఈ రవాణా వ్యవస్థ ఉంటుంది. ఇది వాక్యూమ్ ట్యూబ్‌లలో ప్రత్యేక క్యా్ప్సూల్స్ ద్వారా రైళ్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ‘‘ వాక్యూమ్ ట్యూబ్ లోపల విద్యుదయస్కాంతపరంగా పైకి లేచే పాడ్ కలిగి ఉంటుంది. ఇది ఘర్షణ, గాలిని నిరోధిస్తుంది. పాడ్ మాక్ 1.0 వరకు వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. సముద్ర మట్టం వద్ద ఒక మాక్ అంటే గంటకు దాదాపుగా 761 మైళ్లుగా ఉంటుంది. హైపర్‌లూమ్ వాతావరణ నిరోధకాన్ని కలిగి ఉంటుంది. విమానం కన్నా రెండింతలు వేగంతో ఘర్షణ లేకుండా ప్రయాణించగలదు. తక్కువ విద్యుత్ వినియోగం, 24 గంటల ఆపరేషనల్ సామర్థ్యం ఉంటుంది.
The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!