NTV Telugu Site icon

Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..

Hyperloop

Hyperloop

Hyperloop: ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌కి ఇండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు భారతదేశంలో మొట్టమొదటి ‘‘హైపర్‌లూమ్’’ టెస్ట్ ట్రాక్‌ని మరింత డెవలప్ చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌కు, ఇండియన్ రైల్వేస్ అదనంగా 1 మిలియన్ డాలర్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ‘‘ఆవిష్కార్’’ పేరుతో పిలువబడే 422 మీటర్ల పొడవైన ట్రాక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో గంటలకు 1000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో, ఈ వాక్యూమ్ ట్యూబ్‌లో హై స్పీడ్ రైలు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.

ఒక విధంగా చెప్పాలంటే, హైదరాబాద్-న్యూఢిల్లీల మధ్య దూరం దాదాపుగా 1700 కి.మీ. ఈ దూరాన్ని కేవలం 3 గంటల్లోనే హైపర్‌లూమ్ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు టెస్ట్ ట్రాక్ నిర్మాణం, అభివృద్ధిలో లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) కన్స్ట్రక్షన్, ఆర్సెలర్ మిట్టల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ పరిశ్రమ సంస్థల నుండి మద్దతు లభించింది. భవిష్యత్తులో చెన్నై-బెంగళూర్ మధ్య హైపర్‌లూమ్ కారిడార్‌ని రూపొందించడానికి ఈ సాంకేతికతు విస్తరించడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలు ఉన్నాయి.

Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్‌కి క్లియర్ మెసేజ్..

ఈ హైపర్‌లూమ్ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్న బుల్లెట్ రైల్ వంటి హైస్పీడ్ రైళ్లకు మించి ఉండబోతోంది. దేశంలో రవాణా మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అత్యంత వేగవంతమైన, సమర్థవంతమైన, స్థిరమైన ట్రావెల్ ఆప్షన్‌గా మారుతుంది. ఇది దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాకుండా. ప్రపంచ వేదికపై భారత్‌‌ని సరికొత్తగా ఆవిష్కరిస్తుంది.

హైపర్‌లూమ్ అంటే ఏమిటి.?

దీనిని ‘‘5వ రవాణా విధానం’’గా పిలుస్తారు. సుదూర ప్రాంతాల మధ్య అత్యద్భుత వేగంతో ఈ రవాణా వ్యవస్థ ఉంటుంది. ఇది వాక్యూమ్ ట్యూబ్‌లలో ప్రత్యేక క్యా్ప్సూల్స్ ద్వారా రైళ్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ‘‘ వాక్యూమ్ ట్యూబ్‌ లోపల విద్యుదయస్కాంతపరంగా పైకి లేచే పాడ్ కలిగి ఉంటుంది. ఇది ఘర్షణ, గాలిని నిరోధిస్తుంది. పాడ్ మాక్ 1.0 వరకు వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. సముద్ర మట్టం వద్ద ఒక మాక్ అంటే గంటకు దాదాపుగా 761 మైళ్లుగా ఉంటుంది. హైపర్‌లూమ్ వాతావరణ నిరోధకాన్ని కలిగి ఉంటుంది. విమానం కన్నా రెండింతలు వేగంతో ఘర్షణ లేకుండా ప్రయాణించగలదు. తక్కువ విద్యుత్ వినియోగం, 24 గంటల ఆపరేషనల్ సామర్థ్యం ఉంటుంది.