Suspicion on wife: అనుమానాలు పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానంతో దాడి చేసుకోవడం. చిన్నారులను సైతం చంపడం గత కొన్నిరోజులుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనే కర్ణాటకలో హాసకేటే లో చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను 15సార్లు కత్తితో పొడిచి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
హాసకోటేకు చెందిన రమేశ్, అర్పిత ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరిద్దరూ హోసకోటేలోనే నివాసం ఉంటున్నారు. అయితే గత ఏడాదిగా వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్యమీద భర్తకు అనుమానం మొదలైంది. రాను అవితీవ్ర తారాస్థాయికి చేరుకున్నాయి. భర్త వేధింపులకు విడాకులు కూడా తీసుకుందామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అయితే అర్పిత తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అయితే.. అర్పితపై కోపం పెంచుకున్న రమేశ్ ఆమెను పిల్లలను హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. అత్తమామ ఇంటికి వెళ్లిన రమేశ్ భార్యతో కలిసి వుందామని ఒప్పించాడు.
Read also: World Bank: ఏ దేశమైనా ఏమున్నది గర్వకారణం. ప్రతిదీ ఆర్థికమాంద్యం వైపు తిరోగమనం. వరల్డ్ బ్యాంక్ ఆందోళన
ఇకనుంచి కలతలు లేకుండా.. అనుమానించనని మాట ఇచ్చి నమ్మబలికాడు. దీంతో ఆమోసపూరిత మాటలు నమ్మిన అర్పిత భర్త రమేశ్ తో బయటకు వెళ్లింది. హోసకోట ఇండస్ట్రీయల్ ప్రాంతానికి తీసుకువెల్లి ఇదే అలుసుగా భావించిన రమేశ్ అతనితో తెచ్చుకున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచాడు. మెడపై దాడి చేసి అర్పితను 15 సార్లు ఆమెను పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయింది. అనంతరం రమేశ్ కూడా తనను తాను పొడుచుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్పిత మరణించింది. రమేశ్ పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్పిత తల్లిదండ్రులు రమేశ్ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Kakani Govardhan Reddy: వికేంద్రీకరణ వద్దని పవన్ ప్రకటన చేయగలరా?