Sonam Raghuvanshi Case: దేశవ్యాప్యంగా సంచలనంగా మారిన హనీమూన్ మర్డర్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 23న మేఘాలయలో రాజా రఘువంశీ అనే వ్యక్తిని, అతడి భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. సోనమ్ తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది. ఈ హత్య కోసం ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకుంది. మేఘాలయలోని తూర్పు కాసీహిల్స్‌లోని లోయలో జూన్ 02న రాజా మృతదేహం లభించింది. సోనమ్ జూన్ 08న ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది.
Read Also: Arya: ఆ హోటల్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఐటీ దాడి గురించి ఆర్య క్లారిటీ
అయితే, ఈ కేసులో సోనమ్‌ని ‘‘వాట్సాప్’’ పట్టించింది. ఆమె తన వాట్సాప్ మెసేజ్‌లు చూసేందుకు డేటా కనెక్షన్ ఆన్ చేయడంతో కేసులో పురోగతి వచ్చింది. రాజా-సోనమ్ జంట వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజా హత్య జరిగిన తర్వాత అతడి ఫోన్‌ని సోనమ్ పగలగొట్టి, ఆ తర్వాత విసిపారేసిందని పోలీసులు తెలిపారు. సోనమ్ కు సంబంధించిన మూడు మొబైల్ ఫోన్లు ఇప్పటికీ కనిపించడం లేదు. పోలీసులు వీటి కోసం వెతుకుతున్నారు.
హత్య జరిగిన తర్వాత, సోనమ్ మేఘాలయ నుంచి ఇండోర్‌కి వచ్చే సమయంలో ఆమె తన సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసి, వాట్సాప్ సందేశాలను చెక్ చేయడానికి డేటా కనెక్షన్ ఆన్ చేసింది. దీంతో ఆమె 3 తన మూడు ఫోన్లలో ఒకదాన్ని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్‌లోనే అనేక జిల్లాలో మూడు ఫోన్ల కోసం అన్వేషణ సాగుతోంది.
