NTV Telugu Site icon

Strange Incident: అంత్యక్రియల్లో విచిత్ర ఘటన.. చనిపోయిన భార్య కంట్లోంటి కన్నీళ్లు.. కట్ చేస్తే!

Jharkhand Wife Tears News

Jharkhand Wife Tears News

Husband Found Tears From His Wife Dead Body While Funeral: జార్ఖాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఘట్ శిలాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. ఒక మహిళ కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చాయి. అలాగే.. ఆమె శరీరం మొత్తం చెమటలు పట్టడాన్ని అందరూ గమనించారు. దీంతో.. తన భార్య బత్రికే ఉందనుకున్న ఆ మహిళ భర్త, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన భార్యని తిరిగి కాపాడుకోవడం కోసం తాపత్రయపడ్డాడు. కానీ.. ఆమె నిజంగానే చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో, ఆయన శోకసంద్రంలో మునిగిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Supreme Court: ప్రేమ వివాహాల్లోనే విడాకులు ఎక్కువ.. సుప్రీం కీలక వ్యాఖ్యలు..

ఘట్ శిలాలో విరామ్ అనే వ్యక్తి తన భార్య పూల్‌మణితో కలిసి నివసిస్తున్నాడు. పూల్‌మణి కామెర్ల జబ్బు బారిన పడటంతో, ఆమెను మే 4వ తేదీన ఒక నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు.. పూల్‌మణికి మెరుగైన చికిత్స అవసరమని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో విరాట్ తన భార్యని ఘట్ శిలా సబ్ డివిజన్ హాస్పిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే.. ఆమె అప్పటికే మృతి చెందింది. వైద్యులు కూడా ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. కానీ.. విరామ్ మాత్రం డాక్లర్ల మాటను నమ్మలేదు. ‘ట్రీట్‌మెంట్ కోసం తీసుకొస్తే, చనిపోయిందని అంటారేంటి? ఆమెకు వెంటనే వైద్యం అందించండి’ అంటూ వాదనలకు దిగాడు. ఆమె నిజంగానే చనిపోయిందని, అయితే ఎలా మృతి చెందిందో తమకు తెలియదని ఆ ఆసుపత్రి వాళ్లు చెప్పారు.

Kodali Nani: ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌కి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్

దాంతో చేసేదేమీ లేక.. విరామ్ రోధిస్తూనే తన భార్య మృతదేహాన్ని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. మరుసటిరోజు అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. ఆమె కంట్లోంచి కన్నీళ్లు వస్తుండటాన్ని విరామ్ గమనించాడు. అలాగే.. ఆమె శరీరమంతా చెమటలు పడుతుండటాన్ని అక్కడున్న వాళ్లందరూ గమనించారు. ఇది చూసి తన భార్య బ్రతికే ఉందనుకొని, ఆమెని కాపాడుకోవడం కోసం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె మృతి చెందిందని మరోసారి నిర్ధారించారు. ‘నా భార్య బ్రతికే ఉంది, సరిగ్గా చూడండి’ అంటూ కన్నీళ్లు కారుస్తూ వేడుకున్నాడు. చివరికి పోలీసులు, బంధువులు నచ్చజెప్పి.. అక్కడి నుంచి వారిని పంపించేశారు.