NTV Telugu Site icon

Hurun India List: “ఆసియా బిలియనీర్ల రాజధాని”గా ముంబై.. బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్..

Mumbai

Mumbai

Hurun India List: హూరన్ ఇండియా రిచ్ లిస్ట్-2024 విడుదలైంది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీని దాటేసి గౌతమ్ అదానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా టాప్-1 స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే, భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియాలోనే ‘‘బిలియనీర్ల రాజధాని’’గా ముంబై నిలిచింది. ముంబై కేవలం ఇండియాలోనే కాదు, ఆసియాలో సత్తా చాటింది. చైనా రాజధాని బీజింగ్‌ని దాటేసి తొలిస్థానంలో నిలిచింది.

ముంబైలో సంపన్న నివాసితుల సంఖ్యలో 386కి చేరుకుంది. ఇండియాలో ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. బెంగళూర్‌ని దాటేసిన హైదరాబాద్ రిచ్ లిస్ట్ ఎంట్రీస్ 2024 ప్రకారం మూడో స్థానంలో ఉండగా, బెంగళూర్ 4వ స్థానానికి చేరింది. హైదరాబాద్‌లో సంపన్న వ్యక్తుల సంఖ్య 104కి చేరుకుంది. తర్వాతి స్థానాల్లో వరసగా చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే, సూరత్, గుర్‌గావ్ ఉన్నాయి.

Read Also: Kangana Ranaut: “అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”

ఇక జాబితా ప్రకారం.. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 92గా ఉంది. బీజింగ్‌లో 91 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ముంబై 3వ స్థానంలో న్యూయార్క్(119), లండన్(97)ల తర్వాత ఉంది. ఇక ఢిల్లీ టాప్-10 గ్లోబల్ సిటీల జాబితాలో చేరింది.

ఇదిలా ఉంటే దేశంలో ఎక్కువ మంది సంపన్నులు నివసిస్తు్న్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ టాప్-10లో ఉన్నాయి.