Site icon NTV Telugu

Indian Army: హిమాలయాల్లో 30 గంటల సెర్చ్ ఆపరేషన్.. హంగేరియన్ పౌరుడ్ని రక్షించిన ఆర్మీ

Indian Army

Indian Army

Hungarian national rescued by Indian Army: ఇండియన్ ఆర్మీ హిమాలయాల్లో తప్పిపోయిన హంగేరియన్ పౌరుడిని రక్షించింది. సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తరువాత తప్పిపోయిన వ్యక్తిని సురక్షితంగా రక్షించారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన హంగేరియన్ జాతీయుడు దారి తప్పిపోయాడు అతని కోసం ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గడ్డకట్టుకుపోయే పరిస్థితులు.. క్షణక్షణం మారే వాతావరణ పరిస్థితుల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.

దాదాపుగా 30 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. హంగేరియన్ జాతీయుడు అక్కోస్ వర్మస్.. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉమసిల పాస్ లో దారి తప్పిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ వెతుకులాట ప్రారంభించింది. దుల్, కిస్త్వార్ ప్రాంతాలకు చెందిన ఇండియన్ ఆర్మీ బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. తప్పిపోయిన వ్యక్తిని గుర్తించిన ఆర్మీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా ఉదంపూర్ కు తరలించారు. హిమాలయాల్లోని ఈ ప్రాంతాన్ని చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుందని.. అలాంటిది 30 గంటల్లో విదేశీ పౌరుడిని గుర్తించడంతో ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Read Also: India vs Pakistan : ఆసియా కప్‌లో రసవత్తర పోరు.. దుబాయ్‌లో భారత్‌-పాక్‌ ఢీ

హంగేరీలోని భారత రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్ చేసింది. భారత సైన్యం, ఆపరేషన్ అండ్ రెస్క్యూ టీమ్ లో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ గర్వంగా ఉందని ట్వీట్ చేసింది. మరోవైపు ప్రమాదం నుంచి కాపాడినందుకు ఇండియన్ ఆర్మీకి థాంక్స్ తెలిపాడు బాధితుడు. నా ఆచూకీ కనిపెట్టినందుకు భారత సైన్యం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ధన్యవాదాలను తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. గత జూన్ లో కూడా ఇలాగే హిమాలయాల్లో తప్పిపోయిన ఓ బృందాన్ని ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేసింది.

Exit mobile version