NTV Telugu Site icon

Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. అయ్యప్పస్వామి దర్శనానికి 10 గంటలు!

Shabarimala

Shabarimala

Sabarimala: శబరిమలలో అయ్యప్ప భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. అయ్యప్ప స్వామి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక, స్పాట్‌ దర్శనానికి 20 వేల టికెట్లను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇచ్చింది. పంబ నుంచి సన్నిదానం వరకు భారీగా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేశారు.

Read Also: AUS vs IND: లంచ్‌ బ్రేక్ సమయానికి ఆసీస్‌ స్కోరు ఎంతంటే..?

అయితే, ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న మకరజ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శబరిమలకు వచ్చే ప్రతి భక్తులు ఈజీగా దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లాలన్న లక్షంతో ఏర్పాట్లు చేస్తున్నామని శబరిమల అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అరుణ్ ఎస్ నాయిర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజూ 90 వేల మంది కంటే ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వస్తుండటంతో భారీగా రద్దీ ఉంటోంది. ఈ మకరవిలక్కు పండుగలో భాగంగా ఈనెల 12వ తేదీన పందలం నుంచి ‘తిరువాభరణం’ ఊరేగింపు స్టార్ట్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Show comments