Site icon NTV Telugu

Mutton Curry: మటన్ ముక్కల కోసం కొట్లాట.. బీజేపీ ఎంపీ విందులో ఘటన..

Mutton

Mutton

Mutton Curry: మటన్ ముక్కుల కొట్లాటకు దారి తీసింది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్‌లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందులో ఈ గలాటా జరిగింది. నవంబర్ 14న జరిగిన ఈ విందు కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వెయ్యి మందికి పైగా ఆహ్వానించినప్పటికీ, హాజరైన వారు కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీ మాత్రమే వడ్డించడంపై అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

READ ALSO: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి

ఇది మొత్తం వివాదంగా మారి కొట్లాటకు దారి తీసింది. ఎంపీ సోదరుడు కేవలం గ్రేవీ మాత్రమే పంపించినట్లు సమాచారం రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. హాజరైనవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Exit mobile version