Site icon NTV Telugu

Mumbai: ఎయిర్‌పోర్టులో రూ.49 కోట్ల గంజాయి పట్టివేత.. స్మగ్లర్లు అరెస్ట్

Mumbaiairport

Mumbaiairport

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా… భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టం చేసినా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిఘా అధికారులు డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నా గంజాయి స్మగ్లింగ్ ఆగడం లేదు. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.49 కోట్ల విలువ చేసే 49 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Trump: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలను ఆవిష్కరించిన ట్రంప్

బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన స్మగ్లర్ల దగ్గర గంజాయి సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను కేటుగాళ్లు బురిడీ కొట్టించేందుకు గంజాయిని లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే యత్నం చేశారు. స్మగ్లర్స్ ఎత్తులను అధికారులు చిత్తు చేశారు. లగేజ్ బ్యాగ్‌లో దాచిన గంజాయిను గుట్టు రట్టు చేశారు. బట్టలతో పాటు గంజాయిను భద్రపరిచారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: WPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టనున్న జెమిమా రోడ్రిగ్స్..?

Exit mobile version