Indian Citizenship: గత ఐదేళ్లలో సుమారు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలి పెట్టుకుంటున్నారని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంటులో తెలిపారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఆయన. ఇండియన్ సిటిజన్‌షిప్ వదులుకొనే వ్యక్తుల వార్షిక రికార్డులను కేంద్ర ప్రభుత్వం భద్రపరుస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రికార్డుల ప్రకారం.. 2011-2019 మధ్య 11,89,194 మంది ఇండియన్స్ తమ పౌరసత్వాన్ని వదిలి పెట్టుకున్నారు.
Read Also: Shambhala : సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
అయితే, గత 14 ఏళ్లల్లో భారత్‌లోని 20 లక్షలకు పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకొన్నట్లు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. దీంతో విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే ఇండియన్స్ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్న ఇండియన్స్ సంఖ్య మరింత పెరిగిందని.. గడిచిన ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదిలి పెట్టుకున్నారని కేంద్రమంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు.
Read Also: Excess Luggage Rules: రైళ్లలో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా.. మీకు ఇది బ్యాడ్ న్యూసే..
కాగా, ఉద్యోగాల కోసం భారత యువత నకిలీ గల్ఫ్ ఉద్యోగ ఆఫర్లకు ఆకర్షితులై అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల బారిన పడుతున్నారని లోక్ సభలో కేంద్ర విదేశీ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. ఇటీవల ఇలాంటి కేసులు తమ దృష్టికి చాలా వచ్చాయి.. వీటిలో చాలా వరకు సోషల్ మీడియాలో జాబ్ ఆఫర్లను నమ్మడంతోనే ప్రారంభమైందన్నారు. ఇలాంటివి నివారించడానికి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా విదేశాంగ శాఖ యువతకు అవగాహన కల్పిస్తోందని వెల్లడించారు. నమోదు కాని ఏజెంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2025 నాటికి 3,505 నమోదుకాని ఏజెంట్ల వివరాలను ఇ-మైగ్రేట్ (eMigrate) పోర్టల్‌లో చేర్చినట్లు తెలిపారు.
