Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Https Www Timesnownews Com India Mehul Choksi Extradition Belgium Court Of Cassation Rejects Appeal

Mehul Choksi: బెల్జియం కోర్టులో మెహుల్‌ చోక్సీకి బిగ్ షాక్.. త్వరలోనే భారత్కి

Published Date :December 18, 2025 , 1:04 pm
By Chandra Shekhar Pamena
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ..
  • మెహుల్ చోక్సీ అప్పీల్‌ను తిరస్కరించిన బెల్జియంలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కసేషన్..
  • త్వరలోనే మెహుల్ చోక్సీని భారత్ కి అప్పగించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్న బెల్జియం..
Mehul Choksi: బెల్జియం కోర్టులో మెహుల్‌ చోక్సీకి బిగ్ షాక్.. త్వరలోనే భారత్కి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రూ.13 వేల కోట్ల స్కామ్ కి పాల్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి బెల్జియంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. భారతదేశానికి తనను అప్పగించకుండా నిలువరించాలంటూ దాఖలు చేసిన అప్పీల్‌ను బెల్జియంలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కసేషన్ తిరస్కరించింది. భారత్‌లో తనకు న్యాయం దక్కదని, తీవ్రంగా హింసకు గురి చేస్తారని చోక్సీ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. చోక్సీపై భారతదేశంలో కోర్టులు సక్రమంగా పని చేస్తున్నాయి, అతడికి అన్యాయం జరిగే అవకాశం లేదని పేర్కొంది. అలాగే, అతడు ప్రస్తావించిన ‘ఫ్లాగ్రంట్ డినైల్ ఆఫ్ జస్టిస్’, హింస, అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు నమ్మదగినవిగా లేవని స్పష్టం చేసింది. అప్పీల్‌ను తిరస్కరించడమే కాకుండా, చోక్సీ 104 యూరోల జరిమాన కూడా విధించింది.

Read Also: Vidyabalan : సౌత్ ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తున్న విద్యాబాలన్

అయితే, ఇంతకుముందు ఆంట్వెర్ప్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లోని ఇండిక్ట్‌మెంట్ ఛాంబర్ ఇచ్చిన తీర్పును కోర్ట్ ఆఫ్ కసేషన్ సమర్థించింది. మెహుల్ చోక్సీ సమర్పించిన పత్రాలు, భారత్‌లో అతడికి వాస్తవంగా తీవ్రమైన ప్రమాదం ఉందని నిరూపించేందుకు సరిపోవని ఇప్పటికే దిగువ కోర్టు తేల్చింది. కోర్ట్ ఆఫ్ కసేషన్ పాత్ర చట్టం సరిగ్గా అమలైందా? న్యాయపరమైన ప్రక్రియలు పాటించబడ్డాయా? అన్నదాన్ని మాత్రమే పరిశీలించడమేనని స్పష్టం చేస్తూ, ఈ కేసులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని వెల్లడించింది.

Read Also: Brazil: 10వ అంతస్తు నుంచి పడి బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి.. ఏం జరిగిందంటే..!

ఇక, మెహుల్ చోక్సీ తన అప్పీల్‌లో ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు, ఇంటర్‌పోల్‌ రెడ్ నోటీసు తొలగింపు, మీడియా కథనాలు, భారత్‌లో న్యాయమైన విచారణ జరగదన్న వాదనలను ప్రస్తావించాడు. అయితే, 2022 నవంబర్‌లో ఇంటర్‌పోల్‌కు చెందిన సీసీఎఫ్ (Commission for the Control of Interpol’s Files) అతడి పేరును రెడ్ నోటీసు జాబితా నుంచి తొలగించినప్పటికీ, అది ఈ కేసుపై ప్రభావం చూపదని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది. మొదటిసారి అన్ని వివరాలు సమర్పించకపోయినా, అప్పీల్ దశలో పూర్తి వాదనలు వినిపించే అవకాశం లభించినందున చోక్సీ హక్కులు ఉల్లంఘించబడలేదని తెలిపింది. కాగా, ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్‌లో జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు చెల్లుబాటవుతాయని ఇప్పటికే బెల్జియంలోని దిగువ కోర్టులు తేల్చిన విషయాన్ని కోర్ట్ ఆఫ్ కసేషన్ మరోసారి ధ్రువీకరించింది.

Read Also: Nidhi Agarwal, Chinmayi : ఫ్యాన్స్ ముసుగులో మృగాలు! నిధి అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్

కాగా, బెల్జియం కోర్టు ఇచ్చిన తీర్పుతో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అయితే, చోక్సీ 2018 జనవరిలో, పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందే భారత్‌ను విడిచి పెట్టాడు. ఈ కేసులో సీబీఐ ఆరోపణల ప్రకారం, మొత్తం రూ.13 వేల కోట్ల స్కాం కేసులో చోక్సీ ఒక్కరే రూ.6,400 కోట్లను కాజేశాడు. భారత్‌ అభ్యర్థన మేరకు 2018 డిసెంబర్‌లో ఇంటర్‌పోల్ అతడి పేరును రెడ్ నోటీసులో చేర్చింది. 2024 ఆగస్టు 27వ తేదీన భారత్‌ బెల్జియంకు అధికారికంగా చోక్సీ అప్పగింత అభ్యర్థన పంపింది. విచారణ సమయంలో అతడి భద్రత, మానవ హక్కులు, వైద్య అవసరాలు, జైలు సదుపాయాలపై బెల్జియంకు ఇండియా హామీలు కూడా ఇచ్చింది. తాజా తీర్పుతో చోక్సీ భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్టైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Belgium Court of Cassation
  • CBI
  • Choksi appeal rejected
  • ED
  • Extradition to India

తాజావార్తలు

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions