Site icon NTV Telugu

Nirmala Sitharaman: ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు

Nirmala

Nirmala

Nirmala Sitharaman: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ (IEC) 2025లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్ గానీ, ఫ్రీ గానీ లేదు.. టారిఫ్‌లు, నాన్-టారిఫ్ అడ్డంకులు ఆర్థిక సాధనాలుగా కాకుండా వ్యూహాత్మక ఆయుధాలుగా మారిపోయాయి అని పేర్కొనింది. అయితే, భారత్‌ ఎప్పుడూ టారిఫ్‌లను ఆయుధాలుగా ఉపయోగించలేదు.. దేశీయ పరిశ్రమలు, ఉపాధిని కాపాడటమే మా లక్ష్యం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది.

Read Also: CM Chandrababu Naidu: ఆ విషయంలో గ్రేట్! పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు..

అయితే, మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్లో భారత్‌ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. టారిఫ్‌లు, ఇతర చర్యల ద్వారా వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ చర్చలు, రాజనీతితో ముందుకెళ్తుందని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 25 శాతం భారత్ నుంచే వచ్చేది.. అలాంటి స్థాయికి మళ్లీ చేరుకోవడమే మన టార్గెట్ కావాలని అన్నారు. ప్రస్తుత సవాళ్ల మధ్య భారత్‌ గ్లోబల్ వాణిజ్యంలో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నమోదు చేస్తుందన్నారు. బడ్జెట్ పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కేంద్రం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోందమని నిర్మలా సీతారామన్ వెల్లడించింది.

Exit mobile version