NTV Telugu Site icon

Wed in India: విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సరైనదేనా..? భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని పీఎం మోడీ పిలుపు..

Pm Modi

Pm Modi

Wed in India: విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ సంపద దేశంలోనే ఉండేలా ‘వెడ్ ఇన్ ఇండియా’ని ప్రోత్సహించాని ప్రజల్ని ఆయన కోరారు. గుజరాత్‌లోని అమ్రేలి నగరంలో ఖోడల్‌ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వాస్తవంగా ప్రసంగించిన ప్రధాని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ చికిత్సలో ప్రజలకు ఇబ్బందలు కలగకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని.. సరసమైన ధరలకు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Read Also: Ram Mandir Holiday: రామ మందిర వేడుక రోజు ఏ రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి..? ఏ సంస్థలకు హాలిడే..?

ఇదిలా ఉంటే గతంలో మన్‌ కీ బాత్ కార్యక్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ బదులుగా భారత్ లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని సంపన్నులను ప్రధాని మోడీ కోరారు. తాజాగా శ్రీ ఖోడల్‌థామ్ ట్రస్ట్-కాగావాడ్ నిర్వహిస్తున్న లెయువా పాటిదార్ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘‘ విదేశాల్లో వివాహాలు చేసుకోవడం సరైనదేనా..? వివాహం మన దేశంలో ఎందుకు జరగవు..? భారత సంపద ఎంత బయటకు వెళ్తుంది..? విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనే వ్యాధి మీ సంఘంలోకి రాకుండా మీరు మంచి వాతావరణాన్ని సృష్టించాలి. మా ఖోడల్ (ఆ వర్గం పూజించే దేవత) పాదాల వద్ద వివాహం ఎందుకు జరగకూడదు.? నేను ‘వెడ్ ఇన్ ఇండియా అంటాను, మేడ్ ఇన్ ఇండియా, మ్యారీ ఇన్ ఇండియా లాగా’’ అని అన్నారు. సాధ్యమైనంత వరకు ముందుగా మీ దేశంలో పర్యటించండి. మీరు ప్రయాణించాలనుకుంటే దేశంలో తిరగాలని, మీ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Show comments