Site icon NTV Telugu

Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని విప్రో ఎలా గుర్తించిందో తెలుసా..? వైరల్ అవుతున్న స్టోరీ ఇదే..

Moonlighting

Moonlighting

How Did Wipro Catch 300 “Moonlighters”: వర్క్ ఫ్రం హోం అదనుగా పలువురు ఐటీ జాబ్స్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చాయి టెక్ దిగ్గజ కంపెనీలు విప్రో, ఐబీఎం, ఇన్ఫోసిస్. ఇకపై తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘మూన్ లైటింగ్’ విధానంలోొ రెండు జాబ్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి. మూన్ లైటింగ్ చేస్తున్నారని తెలిస్తే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. ఇక మిగతా ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులు రెండు జాబ్స్ చేసినట్లు తెలిస్తే తొలగించే పనిలో ఉన్నాయి.

తాజాగా విప్రో కంపెనీ 300 మంది ఉద్యోగులను తీసేసింది. తమ సంస్థలో పనిచేస్తూ ఇతర కంపెనీలకు కూడా వర్క్ చేస్తున్నారని తెలిసి వీరందరిపై చర్యలు తీసుకుంది. అయితే ఈ 300 వందల మందిని విప్రో ఎలా గుర్తించిందనేదే అంతుబట్టని విషయం. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ఆఫీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పైగా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అపవాదు ఉంది. ఇంట్లో రెండు వేర్వేరు ల్యాప్‌టాప్‌లు పెట్టుకుని రెండు వేర్వేరు కంపెనీలకు పనిచేస్తున్న ఉద్యోగులను విప్రో ఎలా గుర్తించిందనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

Read Also: Mulayam Singh Yadav: ముగిసిన ములాయం సింగ్ అంత్యక్రియలు.. హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్

అయితే వీరిందరిని ఇలా గుర్తించి ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై రాజీవ్ మోహతా అనే వ్యక్తి అక్టోబర్ 10న ట్వీట్ చేశారు. దీనికి ఇప్పటికే 10,000 వేలకుపైగా రిప్లేలు వచ్చాయి. ప్రతీ కంపెనీ కూడా ఉద్యోగి ‘‘ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్’’ ద్వారా వీరందరిని గుర్తించారని పేర్కొన్నారు. ప్రతీ కంపెనీ కూడా తమ ఉద్యోగి పేరుతో పీఎఫ్ డబ్బును క్రమం తప్పకుండా జమ చేయాలని, దానిని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రతీ నెల పీఎఫ్ కింద జమ చేస్తారు.

అయితే పీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో వ్యక్తి సంబంధించిన ఆధార్, పాన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ మొదలైనవి తీసుకుంటారు. వీటన్నింటిని పీఎఫ్ ఖాతాతో అనుసందిస్తుంటారు. అయితే మూన్ లైటింగ్ చేస్తున్నవారికి రెండు కంపెనీలకు చెందిన రెండు పీఎఫ్ అకౌంట్లను క్రియేట్ చేయడంతో విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ పీఎఫ్ అధికారులు ‘‘డి-డూప్లికేట్ అల్గారిథమ్’’ ద్వారా రెండు ఖాతాలు ఉన్న ఉద్యోగులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతోనే విప్రో మూన్ లైటింగ్ చేస్తున్న వారిని గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పీఎఫ్ అధికారులు ధృవీకరించలేదు.

Exit mobile version